'నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు'
MHBD: పెద్దవంగర మండల కేంద్రంలోని వైన్స్ షాపును సిబ్బందితో కలిసి తొర్రూరు ఎక్సైజ్ సీఐ అశోక్ తనిఖీ నిర్వహించారు. మద్యం అమ్మకాల రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు, మద్యం నాణ్యత, షాపు పనితీరును క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ... ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. మైనర్లకు మద్యం విక్రయించవద్దని సూచించారు.