గ్యాస్ గోదామును పరిశీలించిన తహసీల్దార్

గ్యాస్ గోదామును పరిశీలించిన తహసీల్దార్

HNK: శాయంపేటలోని భారత్ గ్యాస్ గోదామును తహసీల్దార్ ఆర్. ప్రవీణ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. భారత్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలోని నిల్వ, పంపిణీ రిజిస్టర్లను తహసీల్దార్ క్షుణ్ణంగా పరిశీలించారు. గోదాంలో ఇప్పటివరకు గృహ అవసరాల సిలిండర్లు 440, వాణిజ్య అవసరాల సిలిండర్లు 32 అందుబాటులో ఉన్నాయని, గృహ వినియోగదారులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని అన్నారు.