VIDEO: యువ సంఘం ఫేజ్ 6కి దరఖాస్తులు ఆహ్వానం
WGL: వరంగల్ కేంద్ర విద్యాశాఖ ఆధ్వర్యంలో 'యువ సంఘం' ఫేజ్ 6కు నిట్ వరంగల్ నోడల్ కేంద్రంగా దరఖాస్థులను ఆహ్వానిస్తోంది. దేశంలోని వివిధ రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, విద్యా సంబంధిత మార్పిడి కోసం ఈ కార్యక్రమాన్ని 7రోజుల పాటు మేఘాలయలో నిర్వహించనుంది. 18 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉన్నత విద్యాసంస్థల్లో చదువుతున్న యువత ఈనెల 18లోపు దరఖాస్తులు సమర్పించాలి.