రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

రేపు పీజీఆర్ఎస్ కార్యక్రమం

VZM: ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా సోమవారం ప్రజా వినతుల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రామ సుందర్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు కలెక్టరేట్‌లో ఈ కార్యక్రమం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలపై పూర్తి సమాచారం, ఆధారాలతో హాజరుకావాలని ఆయన కోరారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.