VIDEO: రైతుల కోసమే భూభారతి చట్టం: కొండా సురేఖ

SRD: రైతుల కోసమే ప్రభుత్వం భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందని జిల్లా ఇంఛార్జ్ మంత్రి కొండా సురేఖ అన్నారు. హత్నూర మండలం దౌల్తాబాద్‌లో భూభారతి అవగాహన సదస్సును సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ.. ఈ చట్టంతో రైతుల సమస్యలు త్వరగా పరిష్కారం అవుతాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీ రఘునందన్ రావు, టీజీఐఐసి చైర్‌పర్సన్ నిర్మలారెడ్డి పాల్గొన్నారు.