VIDEO: రోడ్డు సరిగా లేక ప్రజల ఇబ్బందులు
SRCL: రోడ్డు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తంగళ్ళపల్లి మండల కేంద్రం నుంచి లక్ష్మీపూర్ కు వెళ్లే రోడ్డు సరిగా లేకపోవడంతో ప్రజలు వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. రోడ్డు గుంతల మయంగా మారడంతో వాహనాలు కూడా పాడవుతున్నాయని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధిత అధికారులు స్పందించి రోడ్డును బాగు చేయించాలన్నారు.