మే నెల 9న జాతీయ లోక్ అదాలత్
E.G: మే నెల 9న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని 9వ అదనపు జిల్లా జడ్జి ఎం.అనురాధ కోరారు. మంగళవారం కొవ్వూరులో న్యాయవాదులతో ఆమె సమావేశమయ్యారు. రాజీ మార్గం ద్వారా కేసులను పరిష్కరించుకుంటే సమయం, డబ్బు ఆదా అవుతాయన్నారు. ఎక్కువ కేసులు పరిష్కారమయ్యేలా న్యాయవాదులు సహకరించాలని కోరారు.