తుని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పక్షోత్సవాలు

తుని అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత పక్షోత్సవాలు

KKD: తునిలో మార్చి 8 నుంచి 15 వరకు అంగన్వాడీ కేంద్రాల్లో పరిశుభ్రత అవగాహన పక్షోత్సవాలు నిర్వహిస్తున్నట్లు పీవో శ్రీలత తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా జరుగుతున్న ఈ కార్యక్రమాల్లో పిల్లల వ్యక్తిగత శుభ్రత, ఇంటి పరిశుభ్రతపై వర్కర్లు అవగాహన కల్పిస్తున్నారు. ముఖ్యంగా మరుగుదొడ్ల వినియోగం, చేతులు కడుక్కోవడం, నీటి నిల్వలపై సూపర్వైజర్లు పర్యవేక్షణ చేస్తున్నారు.