రేపు జిల్లాలో పర్యటించనున్న ఇంధన శాఖ మంత్రి

రేపు జిల్లాలో పర్యటించనున్న ఇంధన శాఖ మంత్రి

AKP: రాష్ట్ర ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ ఈనెల 5న జిల్లాలో పర్యటించనున్నట్లు జిల్లా అధికారులు తెలిపారు. ఉదయం 9 గంటలకు అనకాపల్లిలో ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ అధ్యక్షతన విద్యుత్ సర్కిల్ కార్యాలయానికి శంకుస్థాపన చేస్తారన్నారు.10.45 గంటలకు కోటపాడు మండలం చౌడువాడలో, మధ్యాహ్నం 2.15 గంటలకు కింతలిలో సబ్‌స్టేషన్‌లను ప్రారంభిస్తారని పేర్కొన్నారు.