కాంగ్రెస్ నాయకుడికి ఎమ్మెల్యే నివాళి

NRPT: దామరగిద్ద మండలం ఆశన్ పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకుడు నరేష్ రెడ్డి గుండెపోటుతో మరణించాడు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే చిట్టెం పర్ణికారెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షుడు శివకుమార్ రెడ్డి శుక్రవారం నరేష్ పార్థివదేహాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.