తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

తుఫాన్‌పై అధికారులు అప్రమత్తంగా ఉండాలి: మంత్రి

SKLM: మొంథా తుఫాన్ నేపథ్యంలో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అంబేద్కర్ కోనసీమ జిల్లా అధికారులకు ఆదివారం సూచనలు చేశారు. తుఫాన్ పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల కలెక్టర్‌లకు, ఎస్పీలతో అచ్చెన్నాయుడు ఫోన్‌లో మాట్లాడారు. చెరువులు, నదులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు.