బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం
MDK: రామాయంపేట మున్సిపాలిటీ పరిధి నాలుగో వార్డ్ బీసీ కాలనీలో శుక్రవారం బాల్యవివాహాల నిరోధంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. అంగన్వాడి కేంద్రం ఆధ్వర్యంలో ఆశా వర్కర్లు, స్థానిక విద్యార్థులతో కలిసి ర్యాలీ నిర్వహించారు. బాల్య వివాహాల వల్ల జరిగే అనర్ధాలను వివరిస్తూ ఈ ర్యాలీ కొనసాగింది. బాల్యవివాహాలు చేస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని తెలిపారు.