ఘనంగా నెహ్రూ జయంతి వేడుకలు
VZM: విజయనగరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు మరిపి విద్యాసాగర్ ఆధ్వర్యంలో జవహర్ లాల్ నెహ్రూ జయంతి వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. నెహ్రూ దేశానికి చేసిన సేవల గురించి వారు కొనియాడారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.