'రైతులకు సరిపడా యూరియా అందించాలి'

KMM: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అసమర్ధత వల్లే రైతులు యూరియా కష్టాలు అనుభవిస్తున్నారని సీపీఐ ఎంఎల్ మాస్ లైన్ జిల్లా కార్యవర్గ సభ్యులు ఆవుల అశోక్ అన్నారు. ఆదివారం ఖమ్మం రామనర్సయ్య విజ్ఞాన కేంద్రంలో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా కూడా యూరియా కష్టాలు తప్పడం లేదని చెప్పారు. రైతులకు సరిపడా యూరియా అందించాలన్నారు.