హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడులు

హుక్కా సెంటర్‌పై SOT పోలీసుల దాడులు

MDCL: బాచుపల్లి పోలీస్టేషన్ పరిధిలోని నిజాంపేట్‌లో అనుమతి లేకుండా నడుపుతున్న 'డిఐ కాఫీ షాప్' హుక్కా సెంటర్‌పై SOT పోలీసులు దాడి చేశారు. యజమాని చైతన్యతో పాటు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. సుమారు రూ. 1.09 లక్షల విలువైన 17 హుక్కా పాట్లు, నికోటిన్, 3 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు.