భర్త పురుగుమందు తాగాడని పోలీసులకు ఫోన్

ప్రకాశం: భర్త పురుగుమందు తాగాడంటూ ఓ మహిళ 100కు డయల్ చేసిన ఘటన ఉమ్మడి ప్రకాశం జిల్లా మద్దిపాడులో చోటుచేసుకుంది. ధర్మవరం గ్రామానికి చెందిన బండి రోశయ్య పురుగుల మందు తాగానని భార్యకు ఫోన్ చేసి చెప్పాడు. దీంతో ఆమె వెంటనే 100కు డయల్ చేసి విషయం చెప్పింది. పోలీసులు గాలించి రోశయ్యను మేదరమెట్ల బైపాస్ వద్ద గుర్తించారు.