రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని ఓ కళాశాల సమీపంలో బుధవారం రాత్రి రోడ్డుప్రమాదం జరిగింది. గుర్తుతెలియని భారీ వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. పెడన 15వ వార్డు టీడీపీ ఇంఛార్జ్ కుర్షిద్ బేగం భర్త మృతి చెందగా, కుటుంబ సభ్యులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.