అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు
గుంటూరు: తెనాలి త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం అర్ధరాత్రి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. త్రీ టౌన్ సీఐ సాంబశివరావు సిబ్బందితో కలిసి పలు ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు. మద్యం తాగి వాహనాలు నడుపుతున్న పలువురిని గుర్తించి బ్రీత్ అనలైజర్ టెస్టులు చేశారు. మద్యం తాగి ఆటోలు, ద్విచక్ర వాహనాలు నడుపుతున్న ఐదుగురిని గుర్తించి కేసులు నమోదు చేశారు.