'పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలి'
BHNG: ప్రస్తుతం జరుగనున్న పంచాయతీ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా అదనపు కలెక్టర్ భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం వలిగొండ రైతువేదికలో నిర్వహించిన ఎన్నికల అధికారుల శిక్షణ తరగతుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. ఎన్నికల విధులు నిర్వహిస్తున్న అధికారులు బాధ్యతాయుతంగా పంచాయతీ ఎన్నికలను 100 శాతం పూర్తి చేయాలని అన్నారు.