పరుగు పందెంలో సంగారెడ్డి విద్యార్థికి బంగారు పతకం

SRD: హనుమకొండలో జరుగుతున్న తెలంగాణ 11వ రాష్ట్రస్థాయి అథ్లెటిక్ ఛాంపియన్‌షిప్ పోటీల్లో సంగారెడ్డికి చెందిన సాయి తేజ గౌడ్ ఆదివారం బంగారు పతకం సాధించారు. అండర్- 16 విభాగంలో 60 మీటర్ల పరుగు పందెంలో సత్తాచాటిన సాయితేజ ప్రథమ స్థానం దక్కించుకున్నారు. దీంతో సాయిని టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావీద్ అలీ అభినందించారు.