యువకుడిపై పోక్సో కేసు నమోదు

BDK: బాల్య వివాహం చేసుకున్న యువకుడిపై ములకలపల్లి పోలీసులు శుక్రవారం పోక్సో కేసు నమోదు చేశారు. ఎస్సై మధుప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. సీతారాంపురంకి చెందిన బాలికను పాతగంగారానికి చెందిన యువకుడు బాల్యవివాహం చేసుకుంటున్నట్లు సమాచారం అందింది. ఘటనాస్థలికి చేరుకునేలోగానే వివాహం జరిగిపోయింది. యువకుడితో పాటు అతని తల్లిదండ్రులపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.