'మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలి'

AKP: నర్సీపట్నం మండలంలోని చెట్టుపల్లి గ్రామం జెడ్పీహెచ్ పాఠశాలలో నేరాలుపై పోలీసులు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రూరల్ ఎస్సై రాజారావు మాట్లాడుతూ.. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఎవరైనా డ్రగ్స్ బారిన పడితే వెంటనే తమకు సమాచారం అందించాలని కోరారు. బాధితులు కోరుకునే విధంగా చికిత్స అందిస్తామన్నారు.