రేపు జిల్లా కలెక్టరేట్‌లో పీజీఆర్ఎస్
PPM: రేపు జిల్లా కలెక్టరేట్‌లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తునట్లు కలెక్టర్ ఎన్. ప్రభాకర్ రెడ్డి ఇవాళ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు తమ అర్జీలను సమర్పించవచ్చని తెలిపారు. కార్యక్రమానికి హజరుకాలేని వారు తమ అర్జీలను ఆన్‌లైన్ ద్వారా సమర్పించవచ్చని పేర్కొన్నారు. అర్జీల వివరాలు తెలుసుకునేందుకు 1100 టోలే ఫ్రీ నంబర్‌ను సంప్రదించాలన్నారు.