కోర్టులు చెప్పాయనే ఎన్నికలు జరుపుతున్నాం: భట్టి
TG: DCCల నియామకంలో సామాజిక న్యాయం పాటించామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. రిజర్వేషన్ల బిల్లు కేంద్రం, గవర్నర్‌కు పంపామని చెప్పారు. ఢిల్లీలో ధర్నా చేశామని, ప్రధాని మోదీని కలిసే ప్రయత్నం చేశామని పేర్కొన్నారు. కోర్టులు చెప్పాయనే స్థానిక ఎన్నికలు జరుపుతున్నామన్నారు. పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపించాలని కోరారు.