వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన ఛైర్మన్‌గా నియామకం
GNTR: తెనాలి వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్‌గా జనసేన నాయకుడు తోట దుర్గాప్రసాద్‌ను నియమిస్తూ కూటమి ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఛైర్మన్ పదవి ఎవరికి దక్కుతుందోనని చాలా కాలంగా ఎదురుచూస్తున్న కూటమి శ్రేణులకు ఈ ప్రకటన ఊరటనిచ్చింది. ఈ పదవి కోసం అనేక మంది ఆశించినప్పటికీ, పార్టీలో సాధారణ కార్యకర్తగా ఉన్న దుర్గాప్రసాద్‌కు ఈ పదవి దక్కింది.