విజృంభిస్తున్న విష జ్వరాలు

కడప: సిద్దవటం మండలంలోని జంగాలపల్లి SC కాలనీలో విష జ్వరాలతో ప్రజలు అల్లాడుతున్నారు. గత15 రోజులుగా ప్రజలు దగ్గు, జలుబు కీళ్ల నొప్పులు, జ్వరాలతో తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. మెరుగైన వైద్యం కోసం కడప, తిరుపతి కార్పొరేట్ వైద్యశాలకు తరలి వెళుతున్నారు. సంబంధిత వైద్యాధికారులు గ్రామంలో పర్యటించి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయాలని పరిసర గ్రామాల ప్రజలు కోరుతున్నారు.