జిల్లా కలెక్టర్‌గా ఎస్. ప్రభాకర్ రెడ్డి బాధ్యతలు స్వీకరణ

PPM: పార్వతీపురం మన్యం జిల్లా నూతన జిల్లా కలెక్టర్‌గా ఎన్.ప్రభాకర్ రెడ్ది శనివారం బాధ్యతలను స్వీకరించారు. అనంతరం ఆయనకు జేసీ సి.యశ్వంత్ కుమార్ రెడ్డి పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ కె.హేమలత, పార్వతీపురం, పాలకొండ సబ్ కలెక్టర్లు డా. ఆర్.వైశాలి, పవర్ స్వప్నిల్ జగన్నాథ్, తహశీల్దార్ సురేష్ తదితరులు పాల్గొన్నారు.