శిద్ధనకొండూరులో ఉచిత మెగా వైద్య శిబిరం
NLR: ఈనెల 25వ తేదీన కలిగిరి మండలం శిద్ధనకొండూరు ప్రాథమిక పాఠశాల ఆవరణంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆంజనేయులు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్వామి వివేకానంద యువజన సంఘం ఆధ్వర్యాన నెల్లూరు లయన్స్ క్లబ్ సహకారంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ప్రజల గమనించి ఈ శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.