ఎస్పీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు

శ్రీకాకుళం జిల్లా ఎస్పీ కార్యాలయంలో సర్దార్ గౌతు లచ్చన్న జయంతి వేడుకలు నిర్వహించారు. శనివారం చేపట్టిన ఈ కార్యక్రమంలో భాగంగా అదనపు క్రైమ్ ఎస్పీ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో లచ్చన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. ఇటువంటి మహోన్నత వ్యక్తి శ్రీకాకుళం జిల్లా వాసి కావడం ఆనందదాయకమన్నారు.