అరుదైన ఫొటోలు పంపించండి.. గెలవండి!
TG: పర్యాటకులు, సృజనాత్మకదారులను ప్రోత్సహించేందుకు '100 వీకెండ్ వండర్స్ ఆఫ్ తెలంగాణ' పోటీలను రాష్ట్ర పర్యాటక శాఖ నిర్వహిస్తోంది. ఈ పోటీల ద్వారా అరుదైన ప్రాంతాల అందాలు, ఇప్పటివరకు వెలుగులోకి రాని ప్రాంతాలు, వారాంతపు ప్రదేశాలను ఫొటోలు, వీడియోల రూపంలో తీసి పంపించాలి. మొదటి బహుమతి రూ. 50,000. పూర్తి వివరాలకు WWW.TOURISM.TELANGANA.GOV.IN వెబ్‌సైట్‌ను సందర్శించండి.