కొయ్యూరు మల్లికార్జున స్వామి ఆలయంలో భక్తుల సందడి
ASR: కార్తీక మాసం రెండవ సోమవారం సందర్భంగా కొయ్యూరు శివారులలో ఉన్న మల్లికార్జున స్వామి ఆలయం వద్ద భక్తుల సందడి నెలకొంది. ఉదయాన్నే భక్తులు ఆలయం వద్దకు చేరుకున్నారు. పక్కనే ఉన్న సెలయేటిలో స్నానాలు ఆచరించారు. అనంతరం ఆలయంలో స్వామికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. కొయ్యూరు నుంచే కాకుండా చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.