నేరస్తుల్లో భయం పెరగాలి: ఎస్పీ సతీష్ కుమార్
సత్యసాయి: తప్పు చేసిన వారికి శిక్ష పడితే నేరస్తుల్లో భయం, నిరపరాధుల్లో నమ్మకం పెరుగుతుందని శ్రీ సత్య సాయి జిల్లా ఎస్పీ ఎస్. సతీష్ కుమార్ అన్నారు. సాయి ఆరామంలో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ విచారణలు, మహిళలపై నేరాలు త్వరగా పూర్తి చేయాలని డీఎస్పీలు, సీఐలకు ఆదేశించారు. రౌడీషీటర్లపై నిఘా పెంచాలని, రాత్రి గస్తీని బలపరచాలని సూచించారు.