VIDEO: అన్ని పంచాయతీల్లో కాంగ్రెస్ జెండా ఎగరేస్తాం: జగ్గారెడ్డి
SRD: సంగారెడ్డి నియోజకవర్గంలోని మొత్తం 84 గ్రామ పంచాయతీల్లో కాంగ్రెస్ జెండాను ఎగరవేస్తామని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం కొండాపూర్ మండలం మల్కాపూర్లోని ఓ ఫంక్షన్ హాల్లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యకర్తల విస్తృత సమావేశం నిర్వహించారు. రానున్న స్థానిక ఎన్నికలకు సంబంధించి పార్టీ కార్యకర్తలకు పలు సూచనలు చేశారు.