VIDEO: స్వీపింగ్ పనులను ఆకస్మికంగా తనిఖీ చేసిన కమిషనర్

NLR: నెల్లూరు నగరపాలక సంస్థ కమిషనర్ నందన్ పారిశుధ్య నిర్వహణ పనుల పర్యవేక్షణలో భాగంగా సోమవారం ఉదయం నగరంలోని వివిధ ప్రాంతాలలో స్వీపింగ్ మిషన్ వాహనాల ద్వారా జరుగుతున్న పనులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. రోడ్లపైన ఎండ్ టు ఎండ్ శుభ్రం చేయాలని, స్పీడ్ బ్రేకర్లు, డివైడర్ల వద్ద శుభ్రం చేసేందుకు ప్రత్యేకంగా దృష్టి సారించాలన్నారు.