బైక్–కారు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు

బైక్–కారు ఢీకొన్న ఘటనపై కేసు నమోదు

 అన్నమయ్య: ములకలచెరువు మండలం పెద్దపాలెం గేటు వద్ద ఈ నెల 7న రాత్రి జరిగిన బైక్-కారు ప్రమాదంలో గాయపడిన సుల్తాన్ చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనలో పీటీఎం ఎస్సై హరిహరప్రసాద్ కారు ఢీకొన్నట్లు తెలిసింది. అన్నమయ్య జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు కారును సీజ్ చేశారు. ప్రమాదానికి కారణమైన డ్రైవర్ మౌలాలిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు.