పన్నుల వసూళ్లే లక్ష్యం: కమిషనర్
W.G: ఆస్తి, మంచినీటి పన్నుల వసూళ్లపైనే దృష్టి సారించాలని ఆకివీడు నగర పంచాయతీ కమిషనర్ కృష్ణమోహన్ సిబ్బందిని ఆదేశించారు. బుధవారం సచివాలయ సిబ్బందితో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కలెక్టర్ నాగరాణి ఆదేశాల మేరకు నిర్ణీత లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలన్నారు. వసూళ్ల ప్రక్రియలో అలసత్వం వహించకుండా ప్రతి ఇంటికీ వెళ్లి పన్నులు సేకరించాలని స్పష్టం చేశారు.