అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంపు

అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంపు

TG: ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ మృతి నేపథ్యంలో HYDలో నిరసన ర్యాలీలు చేపడుతుండడంతో అమెరికా కాన్సులేట్‌కు భద్రత పెంచారు. నానక్‌రామ్‌గూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లోని ఈ కార్యాలయం వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. అమెరికన్ కాన్సులేట్ పరిసర ప్రాంతాల్లో వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఐటీ కారిడార్‌లోని స్టార్ హోటళ్లపైనా పోలీసులు ప్రత్యేక దృష్టిసారించారు.