సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే
SRD: పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి రూ. 2 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రభుత్వ సమీకృత కార్యాలయ భవనాన్ని ప్రారంభించారు. నీటిపారుదల, గ్రామీణ నీటిపారుదల, పంచాయతీరాజ్ ఇంజనీరింగ్, అంగన్వాడి వంటి విభాగాల కార్యాలయాలు ఒకే చోట ఉండేలా భవనాన్ని నిర్మించారు. ఈ భవనం ఆదిత్రి హౌసింగ్ ప్రైవేట్ లిమిటెడ్, జీవీఆర్ ఎంటర్ప్రైజెస్ సంస్థల సౌజన్యంతో నిర్మితమైంది.