ఈ నెల 4న హుండీ కానుకల లెక్కింపు
NDL: మహానంది క్షేత్రంలో ఈ నెల 4నహుండీ కానుకల లెక్కింపు నిర్వహించనున్నట్లు ఈవో నల్లకాలువ శ్రీనివాసరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. కామేశ్వరీ దేవి సహిత మహానందీశ్వర స్వామి వారి ఆలయాలతో పాటు కోదండ రామాలయం, వినాయక నంది, గో సంరక్షణ, అన్నప్రసాద విభాగాల్లోని హుండీ కానుకల లెక్కింపు ఉంటుందన్నారు. సిబ్బంది అందరూ హాజరు కావాలని సోమవారం సర్కులర్ జారీ చేశారు.