మద్యం షాపును తీసివేయాలంటూ ధర్నా

మద్యం షాపును తీసివేయాలంటూ ధర్నా

BPT: ఈపురుపాలెం గ్రామం నుంచి తోటవారిపాలెంకి వెళ్లే మసీదు దగ్గర మద్యం షాపు తీసివేయాలని గ్రామస్థులు పెద్ద ఎత్తున చీరాల ఎమ్మార్వో ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ముస్లింలు అత్యంత పవిత్రంగా భావించే మసీదు వద్ద కొందరు వ్యక్తులు దౌర్జన్యంగా మద్యం షాపును ఏర్పాటు చేస్తున్నారన్నారు. షాపును వెంటనే తీసివేయాలని డిమాండ్ చేశారు.