డాక్టర్ ఫోన్ హ్యాక్.. ఏకంగా రూ. 6 లక్షలు స్వాహా

డాక్టర్ ఫోన్ హ్యాక్.. ఏకంగా రూ. 6 లక్షలు స్వాహా

GNTR: మంగళగిరిలో ఓ మహిళా వైద్యురాలి ఫోన్ నుంచి డబ్బులు కాజేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. డాక్టర్ పేరుతోనే ఆమె 10 మంది సన్నిహితులకు నా యూపీఐ పని చేయట్లేదని, అర్జెంట్ ఉన్నామయని రూ. 65 వేలు పంపించమంటూ మెసేజ్‌లు పెట్టారు. వారు దాదాపు రూ. 6 లక్షలు పంపారు. డబ్బులు పంపామని ఆమెకు ఫోన్ చేయడంతో విషయం బయటపడింది. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.