రేపల్లెలో స్వచ్ఛరథం వాహన పథకం ప్రారంభం
BPT: రేపల్లెలోని పేటేరులో స్వచ్ఛరథం వాహనాన్ని టీడీపీ సీనియర్ నాయకుడు అనగాని శివప్రసాద్ శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ స్వచ్ఛతను లక్ష్యంగా పెట్టుకుని ఈ పథకాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని పేర్కొన్నారు. ప్రతి ఇంటి నుంచి పొడి, తడి చెత్తను సేకరించి పర్యావరన పరిరక్షణకు తోడ్పడటంతో పాటు చెత్త వినియోగదాయక వనరుగా మలిచే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు.