పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సరెండర్

PPM: పార్వతీపురం మున్సిపల్ కమిషనర్ సిహెచ్ వెంకటేశ్వర్లను సరెండర్ చేస్తూ ఆ శాఖ ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగులు, స్థానికులు గతంలో ఆర్జెడీకి ఫిర్యాదు చేయడంతో ఈయనపై విచారణ చేపట్టారు. విచారణ ఆయనను సరెండర్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. తదుపరి పోస్టింగ్ కోసం మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డైరెక్టర్ కార్యాలయానికి నివేదించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.