సీఎం చంద్రబాబు దృష్టికి సమస్యలు

మన్యం: కురుపాం ఎమ్మెల్యే తోయక జగదిశ్వరి శుక్రవారం సీఎం చంద్రబాబును విజయవాడ క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కుంకీ ఏనుగుల సమస్యపై, ఇంజినీరింగ్ కాలేజీ పనుల కోసం నిధులు, వసతి గృహాల్లో ANMలు, గిరిజనులకు సంబంధించి GO నంబర్-3 స్థానంలో ప్రత్యామ్నాయ జీవోను తీసుకువచ్చేలా కృషి చెయ్యాలని విన్నవించినట్లు తెలిపారు.