సీఎం సహాయనిధి చెక్కులను అందజేసిన ఎమ్మెల్యే జారే

BDK: అన్నపురెడ్డి పల్లి మండలంలో ఆదివారం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ పర్యటించారు. అనంతరం పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని లబ్ధిదారులకు సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు. వారు మాట్లాడుతూ.. ప్రజా ప్రభుత్వంలో ప్రతి నిరుపేద సంతోషంగా జీవించాలనే సంకల్పంతో ఎప్పటికప్పుడు సీఎం సహాయ నిధి చెక్కులను అందజేస్తున్నట్లు తెలిపారు.