75 మీటర్ల జాతీయ జెండాతో BJP భారీ ర్యాలీ

75 మీటర్ల జాతీయ జెండాతో BJP భారీ ర్యాలీ

మేడ్చల్: ఎల్లంపేట్ మున్సిపాలిటీలోని రావల్కోల్ గ్రామంలో BJP ఆధ్వర్యంలో 'హర్ ఘర్ తిరంగా' కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా 75 మీటర్ల జాతీయ జెండాతో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ ప్రజలందరూ ఐక్యంగా ఉంటేనే దేశం అభివృద్ధి చెందుతుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో BJP జిల్లా, మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.