జిల్లా క్రీడా శాఖాధికారిగా శ్రీనివాస్ రెడ్డి
SDPT: సిద్దిపేట జిల్లా క్రీడాశాఖాధికారిగా డీఈవో శ్రీనివాస్ రెడ్డి అదనపు బాధ్యతలు స్వీకరించారు. జంగపల్లి వెంకట నర్సయ్య బాధ్యతలు ఈయనకు అప్పగించారు. అయితే, ఏడాది పూర్తి కాకముందే వెంకట నర్సయ్య బదిలీ కావడం చర్చనీయాంశమైంది. సీనియారిటీ వివాదాల నేపథ్యంలో ఈ మార్పు ప్రాధాన్యత పొందింది.