సీఎం రేవంత్ ఏమైనా గాంధీనా?: దాసోజ్ శ్రవణ్
HYD: గజ్వేల్ లోని మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ ఆఫీసుపై కాంగ్రెస్ దాడి చేసిన ఘటనపై BRS ఎమ్మల్సీ దాసోజ్ శ్రవణ్ కుమార్ స్పందించారు. 'సీఎం రేవంత్ నువ్వు ఏమైనా గాంధీవా, నెహ్రూవా, సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్‌వా?.. అసలు నీ ఫోటో పెట్టేది ఏంది' అని విమార్శించారు. 'నోరు విప్పితే పచ్చి బూతులు మాట్లాడే నీ ఫోటో పెట్టుకుని జనాలు బూతులు నేర్చుకోవాలా' అని ఎద్దేవాచేశారు.