దగ్గుమందు తాగి మరో చిన్నారి మృతి

దగ్గుమందు తాగి మరో చిన్నారి మృతి

మధ్యప్రదేశ్‌లో దగ్గు మందు తాగి 24 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి ఘటనే మరొకటి జరిగింది. బిచ్వా గ్రామానికి చెందిన సందీప్ తన కుమార్తెకు దగ్గు రావటంతో ఓ ఆయుర్వేద మెడికల్ షాపులో సిరఫ్ కొని చిన్నారికి తాగించాడు. వెంటనే ఆ చిన్నారికి శ్వాస అందకపోవడంతో ఆసుపత్రికి తరలించగా.. పాప చనిపోయినట్లు వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదైంది.