VIDEO: విఘ్నేశ్వర స్వామి సన్నిధిలో తణుకు ఎమ్మెల్యే
కోనసీమ: తణుకు నియోజకవర్గ ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, శ్రీమతి కృష్ణతులసి దంపతులు ఇవాళ ఉదయం అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించారు. స్వామివారికి 108 కొబ్బరికాయల మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయానికి విచ్చేసిన వారికి మర్యాదలతో స్వాగతం పలికిన ప్రధాన అర్చకులు వేద ఆశీర్వచనం అందజేసి శేష వస్త్రాలతో సత్కరించారు.